దుమ్మురేపుతోన్న సిలక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ రూపొందుతోంది. బెంగళూరు బ్యూటీలు నిధి అగర్వాల్, నభానటేశ్ హీరోయిన్లు. చిత్రీకరణపరంగా సినిమా చివరి దశకు చేరడంతో, త్వరలోనే విడుదల తేదీ ప్రకటించడానికి చిత్రబృందం ఏర్పాట్లు చేసుకుంటోంది. సినిమా మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ప్రమోషన్స్ మొదలుపెట్టేసిన చిత్రబృందం -తాజాగా ఓ వీడియో లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది. ‘దిమాక్ ఖరాబ్’ పేరిట విడుదల చేసిన లిరికల్ వీడియో పూరి స్టామినాను గుర్తు చేస్తూ దుమ్మురేపుతోంది. ‘సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక/ పిలగా పిలగా పిలగా పెట్టిపోరా సురక’ అంటూ మాస్ మూడ్ ఈ పాటను డిజైన్ చేశారు. మాస్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు హీరోయిన్ల కాంబినేషన్‌తో రామ్‌పై చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్‌కు మణిశర్మ సంగీతం సమకూర్చారు. కొద్దికాలంగా సరైన హిట్టులేక డైరెక్టర్ల రేసులో ఒకింత వెనకపడిన పూరి, ఈ సినిమా ఖాయంగా తనకు హిట్టు తెస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. హీరో రామ్ సైతం ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. అయితే, ఇస్మార్ట్ స్క్రిప్ట్ సోషల్ మీడియాలో లీకైనట్టు వార్తలు హల్‌చల్ చేస్తుండటం -పూరి అభిమానుల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది.