నవ్వించీ ఏడిపిస్తాడట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్లుగా దర్శకుడు స్వరూప్‌రాజ్ తెరకెక్కించిన చిత్రం -ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ. నక్కా రాహుల్ యాదవ్ ఈ సినిమా నిర్మించారు. రెండు రోజుల క్రితం విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ -టైటిలే ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నారు. ‘మళ్ళీరావా’ లాంటి మంచి చిత్రాన్ని నిర్మించిన అభిరుచిగల నిర్మాత రాహుల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారంటే -కచ్చితంగా మంచి కంటెంట్ ఉంటుందన్నారు. వైవిధ్యమైన పాత్ర చేస్తున్న హీరో నవీన్‌కు ఈ ప్రాజెక్టు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. మహానటి దర్శకుడు నాగి మాట్లాడుతూ -‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమానుంచే నవీన్‌తో పరిచయం ఉందని, మంచి నటుడని ప్రశంసించారు. యూనిక్ ప్రమోషన్స్‌తో వస్తున్న ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ ట్రైలర్‌లో కామెడీ, థ్రిల్లర్ కంటెంట్ కనిపిస్తోందని, టీమ్‌కు సక్సెస్ అందాలని ఆకాంక్షించారు. చిత్ర దర్శకుడు స్వరూప్ మాట్లాడుతూ -ఏజెంట్ అనే ఆంగ్లపదం పక్కన తెలుగు నేటివిటీ ఆశించి టైటిల్ డిజైన్ చేశామని, టైటిల్‌లో వెరైటీ మాదిరిగానే ఆత్రేయ మిమ్మల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, థ్రిల్ చేస్తాడన్నారు. సినిమా చూశాక ఆడియన్స్‌లో మంచి ఫీలింగ్ కలగటం ఖాయమన్నారు. నిర్మాత రాహుల్ మాట్లాడుతూ -టైటిల్ చూసి కొంత తటపటాయించినా, డిజైన్ చూశాక కన్విన్స్ అయ్యానన్నారు. నటుడు నవీన్, దర్శకుడు స్వరూప్‌ను పరిచయం చేయడం హ్యాపీగా ఉందన్నారు. హీరో నవీన్ మాట్లాడుతూ -షార్ట్ ఫిల్మ్‌తో పరిచయమైన నేను, ఈ ప్రాజెక్టుతో హీరో అవుతున్నా. స్క్రిప్ట్‌రైటింగ్ మీద ఆసక్తితో లండన్ జాబ్ వదిలేసి వచ్చానని, ఏడాదిపాటు కష్టపడి ఈ స్క్రిప్ట్ డిజైన్ చేసినట్టు చెప్పారు. జూన్ 21న థియేటర్లకు వస్తోన్న సినిమా ఆడియన్స్‌ని కచ్చితంగా కన్విన్స్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నామన్నారు.