మెగా ప్రాజెక్టులో గ్లామర్ అనసూయ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుల్లితెరను, వెండితెరను బ్యాలెన్స్ చేసుకుంటూ -ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తోంది అనసూయ. తన క్రేజ్‌కు తగినట్టు మహిళా ప్రాధాన్యత పాత్రలు చేస్తూనే, పెద్ద హీరోల భారీ ప్రాజెక్టుల్లో కీలకమైన పాత్రల్లో ఒదిగిపోతోంది అనసూయ. ప్రస్తుతం క్రైం థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న ‘కథనం’ ప్రాజెక్టుతో అనసూయ బిజీగా ఉంది. ఈ ప్రాజెక్టులో లీడ్‌రోల్ చేస్తూనే, మరో భారీ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. కథనం షూటింగ్ ముగింపునకు చేరడంతో, గ్యాప్ ఇవ్వకుండా భారీ ప్రాజెక్టుకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. సైరా తరువాత చిరంజీవి-కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రాజెక్టుకు అనసూయను ఓకే చేసుకున్నట్టు సమాచారం. చిరు బర్త్‌డే ఆగస్టు 22న సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. చిరుకు జోడీగా శ్రుతిహాసన్ పేరు వినిపిస్తోంది. అయితే, ప్రాజెక్టులో ఓ కీలకమైన పాత్ర కోసం అనసూయను కొరటాల అప్రోజ్ కావడం, ఆమె వెంటనే ఒప్పుకోవడం జరిగిందని అంటున్నారు. ఈ పాత్ర కోసం అనసూయకు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్టు ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట.