సౌత్‌పైనే ఫోకస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి పెద్దగా తెలీకుండానే అడుగుపెట్టానని, ఇక్కడకు వచ్చిన తరువాత మాత్రం సౌత్ ఇండస్ట్రీ హోంటౌన్‌లా అనిపిస్తోందని అంటోంది ముంబై బ్యూటీ దిగంగన సూర్యవంశీ. కార్తికేయ హీరోగా టిఎన్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం హిప్పీలో దిగంగన హీరోయిన్. హిప్పీలో దిగంగన పెర్ఫార్మెన్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో శుక్రవారం మీడియాతో మాట్లాడింది.
‘ముంబైలో సినిమాలు, టెలివిజన్స్ షోస్, సీరియల్స్ చేశాను. సౌత్‌లో మాత్రం ఇదే తొలి సినిమా. ఇక్కడి పరిస్థితులు పెద్దగా అవగాహన లేకుండానే వచ్చాను. ఆడిషన్ టైమ్‌లో పెద్ద డైలాగులు చెప్పమన్నారు. చెప్పగలిగాను. తెలుగు ఒకింత కష్టంగా అనిపించినా, వారంపాటు వర్క్‌షాప్‌కి వెళ్లి, స్క్రిప్ట్ చదువుకుని నన్ను నేను తీర్చిదిద్దుకున్నా. చిత్ర కథ, అందులో నా పాత్ర, కొత్తగా అనిపించిన క్యారెక్టరైజేషన్ నచ్చి ప్రాజెక్టుకు ఓకే చెప్పాను. ఆముక్త మాల్యద పాత్ర నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. ఇందులో లివింగ్ రిలేషన్‌షిప్ గురించి డిస్కస్ చేశారు. కొన్ని ఇంటిమేట్ సీన్స్ కథ డిమాండ్ మేరకు చేశాం. అయితే నేను ఏ సినిమా చేసినా తల్లిదండ్రులతో కలిసి కూర్చుని చూసేలా ఉండాలనుకుంటాను. రియల్ లైఫ్‌లో ‘లివింగ్ టుగెదర్’ని విమర్శించను కానీ, నాకు ఇష్టం ఉండదు. కాని ఆ రిలేషన్‌లోవున్న ప్రేమికులు వాళ్ల బంధాన్ని పరీక్షించుకునే టెస్టింగ్ డ్రైవ్‌లా ఉండకూడదన్నది నా అభిప్రాయం. ఈ ప్రాజెక్టుకంటే ముందు సౌత్‌నుంచి రెండు చాన్స్‌లు వచ్చాయి. కానీ, కుదరలేదు. తెలుగు సినిమాలు చూస్తుంటాను. ఈ ప్రాజెక్టు చేశాక -తెలుగు నాకు హోమ్‌టౌన్‌లా అనిపిస్తుంది. హిందీకి, ఇక్కడికీ పెద్దగా తేడా లేదు, భాష తప్ప. తెలుగులో మరిన్ని మంచి సినిమాలు చేయాలనుకుంటున్నా. అవకాశాలు వస్తున్నాయి కానీ, ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు’.