కితకితలు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామెడీని పండించటంలో రాజేంద్రప్రసాద్ నుంచి నేర్చుకొన్న మెళకువలు తనకు బాగా తోడ్పడ్డాయంటోంది సమంత. సీనియర్ అయిన లక్ష్మితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందట. ఈ రెండూ ‘ఓ బేబీ’తో సాధ్యమయ్యాయి అంటోంది సామ్. సమంత అక్కినేని ప్రధాన పాత్రధారిగా బి నందినిరెడ్డి తెరకెక్కించిన చిత్రం -ఓ బేబి. లక్ష్మి, రాజేంద్రప్రసాద్, రావురమేష్, నాగశౌర్య, తేజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి సురేష్‌బాబు, సునీతా తాటి, టిజి విశ్వప్రసాద్, హ్యూన్‌వూ థామస్ కిమ్ నిర్మాతలు. జూలై 5న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రంలోని ఓ పాట విడుదల చేశారు.
సమంత మాట్లాడుతూ -మంచి సినిమాలు చేయాలి. లేదంటే ఇంట్లో కూర్చోవాలని అనుకుంటున్న తరుణంలో మహానటి, రంగస్థలం చిత్రాల్లో చాన్స్ వచ్చింది. ఈ ఏడాదిలో తమిళంలో సూపర్‌డీలక్స్, తెలుగులో మజిలీ చేశా. ఈ వరసలో నేను చేసిన మరో మంచి చిత్రం -ఓ బేబి అంది సామ్. మానవ జీవితాల్ని స్పృశించే కథ ఇది. ఈ సినిమా చూశావా? నీకేమనిపించింది అని సురేష్‌బాబు అడిగారు. దాంతో పదిసార్లు ఎడిటింగ్ గదికెళ్లి ఓ బేబి చూశా. చూసిన ప్రతిసారీ అమ్మను గాఢంగా, ప్రేమతో హత్తుకోవాలని అనిపించింది. అమ్మా, నాన్నలు ఇంటికోసం త్యాగాలు చేయడం తప్ప మనలాగా కలలు సాకారం చేసుకోవాలనే ఆశతో బతికేవారు కాదు. ఈ సినిమా నా కెరీర్‌లోనే ప్రత్యేకం అని పేర్కొంది.
సురేష్‌బాబు మాట్లాడుతూ కొరియాతోపాటు మరో ఏడు భాషల్లో రీమేక్ అయిన చిత్రం. అన్నిచోట్లా విజయం సాధించింది. కుటుంబ విలువలతో కూడిన కామెడీ ఈ సినిమాలో ఉంటుంది అన్నారు. నందినిరెడ్డి మాట్లాడుతూ సమంత పాత్ర పలు ఛాయల్లో ఆసక్తికరంగా సాగుతుంది. లక్ష్మీభూపాల్ మాటలు, మిక్కి జె మేయర్ చక్కటి సంగీతం అందించారన్నారు.