చాన్స్ కొట్టారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా పేరు సూర్య.. సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు చేస్తోన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమా తాజా షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. అల్లు అర్జున్‌తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలను సక్సెస్ చేసిన త్రివిక్రమ్, హ్యాట్రిక్ ప్లాన్‌తో అడుగు లేస్తున్నాడు. పూజా హెగ్డే మరోసారి బన్నీతో జత కడుతోంది. ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఎక్కువ సినిమాల్లో ఇద్దరు ముద్దుగుమ్మలు కనిపిస్తూ వస్తున్నారు. అరవిందసమేతలో పూజా హెగ్డేతోపాటు తెలుగుమ్మాయి ఈషాను చూపించాడు. ఇప్పుడు బన్నీ ప్రాజెక్టు కోసం పూజాతోపాటు నివేదా పేతురాజ్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో నాయికలిద్దరూ పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. చిత్రలహరితో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పేతురాజ్.
అక్కినేని హీరో కూడా..
ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఏంటంటే -హీరో సుశాంత్ కూడా నటిస్తుండటం. -బన్నీ 19వ సినిమా సెట్స్‌లో నాకు ఫస్ట్ డే. సినిమా గురించి చెప్పలేను కానీ, నాకు ఇష్టమైన త్రివిక్రమ్‌తో పని చేస్తున్నా. అలాగే ‘ఆర్య’ నుంచీ నేనెంతో ఆరాధించే బన్నీతో కలిసి చేస్తున్నా. టబు, నా ఫ్రెండ్ పూజాహెగ్డే, పీఎస్ వినోద్, తమన్ వీళ్లందరితో కలిసి పనిచేయడం థ్రిల్లింగ్‌గా ఉంది. ‘చిలసౌ’ తర్వాత ఇది నాకు సాహసం లాంటిది. ఇంతమందినుంచి నేను ఎంతోకొంత నేర్చుకోగలనన్న నమ్మకముంది’ అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.