‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్‌లుక్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాణిక్యం మూవీస్, ఎస్‌ఎమ్‌కె ఫిలిమ్స్ పతాకాలపై సింగులూరి మోహన్‌రావు నిర్మాతగా సిహెచ్ రవికిషోర్‌బాబు దర్శకత్వంలో బావమరదలు చిత్ర ఫేమ్ మోహన్‌కృష్ణ, హరిణిరెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. మళ్లీ మొదలవుతుంది రచ్చ టాగ్‌లైన్. మనీషా ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేతలు కిషోర్‌రాఠీ, మహేష్‌రాఠీ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న చిత్రానికి సంబంధించి హీరో మోహన్‌కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఫస్ట్‌లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. చిత్ర దర్శకుడు సిహెచ్ రవికిషోర్‌బాబు మాట్లాడుతూ చిరంజీవి సినిమా టైటిల్ పెట్టుకున్న కారణంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తెరకెక్కిస్తున్నామన్నారు. చిత్ర సమర్పకుడు కిషోర్‌రాఠీ మాట్లాడుతూ 1991లో చిరంజీవి గ్యాంగ్ లీడర్‌కు ఎంత పేరొచ్చిందో 2019లో ఆయన అభిమాని మోహన్‌కృష్ణ గ్యాంగ్ లీడర్‌కీ అంతే పేరొస్తుందని ఆకాంక్షించారు. హీరో మోహన్‌కృష్ణ మాట్లాడుతూ నా బర్త్‌డే సందర్భంగా గ్యాంగ్ లీడర్ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. చిరు ఫ్యాన్స్‌కి తగ్గట్టు సినిమాని రూపొందిస్తున్నట్టు చెప్పారు.