ఆశయ స్ఫూర్తితో జై సేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి సముద్ర దర్శకత్వంలో వి సాయి అరుణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం -జై సేన. శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ప్రధాన తారాగణం. సినిమా టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటుడు సునీల్ లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వి సముద్ర మాట్లాడుతూ -సినిమాలో శ్రీకాంత్, సునీల్‌తోపాటు నలుగురు కొత్త హీరోలను పరిచయం చేస్తున్నాం. షూటింగ్ పూరె్తైంది. పదికాలాలు నిలిచే మంచి సినిమాలు తీయాలనే శివ మహాతేజ బ్యానర్ ఓపెన్ చేశాం. తొలి ప్రయత్నంగా చేస్తున్న ప్రాజెక్టు ఇది. పవన్‌కల్యాణ్ స్థాపించిన జనసేన ఆశయ సాధన స్ఫూర్తితో నడిచే చిత్రమే ‘జై సేన’. ఓ సోషల్ కాజ్‌తో చేస్తోన్న సినిమా మంచి పేరు తెస్తుందన్న నమ్మకం ఉంది. వచ్చె నెలలో సినిమాను థియేటర్లకు తెస్తాం’ అన్నారు. సునీల్ మాట్లాడుతూ ఈ సినిమాకు స్క్రిప్టే సూపర్ స్టార్. ఇప్పటివరకూ కామెడీ మాత్రమే చేశాను. ఈ ప్రాజెక్టులో కామెడీతోపాటు వైల్డ్ యాంగిల్ కూడా చూస్తారు. మంచి పాత్ర చేశానన్నారు. సంగీత దర్శకుడు రవిశంకర్ మాట్లాడుతూ ఇదొక పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ. సముద్రతోనే నా జర్నీ మొదలైంది. కచ్చితంగా సినిమా హిట్టవుతుంది’ అన్నారు.