బాలకృష్ణ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల రాజకీయ వేడి పూర్తిగా చల్లబడటంతో బాలకృష్ణ తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. ఆన్‌స్క్రీన్ పాలిటిక్స్‌ని వేడెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. రాజకీయాల నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రానికి ‘రూలర్’ టైటిల్‌నే ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాను కెఎస్ రవికుమార్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ 105వ ప్రాజెక్టుగా తెరకెక్కనున్న చిత్రానికి గతంలోనే ‘రూలర్’ టైటిల్ వినిపించింది. నిజానికి మొన్నటి ఎన్నికలకు ముందే రెగ్యులర్ షూటింగ్ మొదలుకావాల్సి ఉన్నప్పటికీ, ఫలితాల తరువాత స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు సమచారం. ఈ కారణంగానే రెగ్యులర్ షూట్ ఆలస్యమైందని చిత్రబృందం నుంచి వినిపిస్తోంది. సి.కళ్యాణ్ నిర్మిస్తోన్న సినిమాను జూన్ 12న లాంచ్ చేస్తారట. నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. బాలకృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ కనుక -ముందనుకున్నట్టే సినిమాను సంక్రాంతికే విడుదల చేసే అవకాశం ఉంది. టైటిల్ సహా కథానాయికల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.