డిస్కోరాజాతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహర్షి సక్సెస్ అల్లరి నరేశ్‌కు మంచి కిక్కే ఇచ్చినట్టుంది. చాలాకాలంగా చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ లేకపోవడంతో డల్‌గా కనిపిస్తున్న నరేశ్, మహర్షి మూవీ తరువాత ప్రెష్‌గా కనిపిస్తున్నాడు. మహేష్‌బాబు స్నేహితుడు రవి పాత్రకు నరేష్ ఒకవిధంగా ప్రాణం పోశాడనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి మరో ఎమోషనల్ క్యారెక్టర్‌తో ఆడియన్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నాడట నరేశ్. రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘డిస్కోరాజా’ చిత్రంలో నరేశ్ కీలక పాత్ర పోషించనున్నట్టు టాలీవుడ్ వర్గాల మాట. తొలుత ఈ పాత్రకు సునీల్‌ను ఎంపిక చేసుకున్నా, మహర్షిలో తన పెర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా కట్టిపడేసిన నరేశ్ అయితే బావుంటుదన్న నిర్ణయానికి చిత్రబృందం వచ్చినట్టు సమాచారం. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఓ సైఫై థ్రిల్లర్‌గా ఉండబోతోందని సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం రవితేజతో పాయల్ రాజ్‌పుత్, నభానటేశ్‌లు జోడీకట్టడం తెలిసిందే.