రానా.. విరాటపర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన కథలు.. వాటిల్లో విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు రానా. ఆహార్యానికి తగిన కథల్ని ఎంచుకుంటోన్న విషయం ఇప్పటి వరకూ చేసిన సినిమాలు గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది. తాజాగా రానా మరో వైవిధ్యమైన కథతో సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆ ప్రాజెక్టు -విరాటపర్వం. అటు తమిళం, ఇటు బాలీవుడ్ చిత్రాలు చేస్తూనే -తెలుగు ప్రాజెక్టుతో సెట్స్‌పైకి వెళ్లేందుకు సమాయత్తమయ్యాడట. సరిగ్గా వందేళ్ల క్రితం అంటే 1920 నేపథ్యంలో కథ సాగుతుందట. వేణు ఊడుగుల తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్టులో రానాతో సాయిపల్లవి జోడీ కడుతోంది. జూలైలో రెగ్యులర్ షూట్ మొదలు పెట్టేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేసుకుంటోందట. ఈ ప్రాజెక్టు తన కెరీర్‌లోనే ప్రత్యేకమైనదిగా ఉంటుందని రానా సైతం అంటున్నాడు. ఏ పాత్రనైనా అవలీలగా తనవశం చేసుకునే సాయిపల్లవి సైతం -విరాటపర్వం ప్రాజెక్టుపై కొత్త ఆశలతో ఉందట.