నాగ్.. బిగ్‌బాస్ 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన రియాలిటీ షో బిగ్‌బాస్. తెలుగులో తొలి సీజన్‌కు హోస్ట్‌గా చేసిన ఎన్టీఆర్ తన డాన్స్ మరియు హావభావాలతో ఆ సీజన్‌ను సూపర్ సక్సెస్ చేశారు. రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా, దానికి హోస్ట్ ఎవరు అనేదానిపై కొన్నాళ్లుగా చర్చలు నడుస్తున్నాయి. చివరిగా ఈ సస్పెన్స్‌కి తెరదించుతూ స్టార్ మా ఓ స్టార్ హీరోని బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా నియమించినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి రియాలిటీ షోతో ఆకట్టుకున్న నాగార్జున బిగ్‌బాస్ 3కి హోస్ట్ చేయనున్నారని తెలుస్తోంది. అక్కినేని నాగార్జున స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దీనిపై త్వరలో అఫీషియల్ ప్రకటన కూడా చేయనున్నారట. జూలైలో ఈ షో ప్రారంభం కానున్నట్టు సమాచారం. నాగార్జున ఎంట్రీతో ఈ షో మరో ఎత్తుకు చేరుతుందనడంలో సందేహంలేదు.