దేవకీ దొరసాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చమైన తెలంగాణ ప్రేమకథ -దొరసాని. సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా, సేనే్సషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కుతోన్న చిత్రమిది. దొరల గడీల నేపథ్య కాలంనాటి ప్రేమకథకు సంబంధించి తాజాగా టీజర్ విడుదలైంది. ‘వీనికేం తెల్వద్ పీకద్.. దొరసానులెప్పుడైనా బయటికొత్తార్రా’ అంటూ టీజర్‌లో వినిపించిన డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘నేను చిన్ని దొరసాన్ని ప్రేమిస్తానురా.. అంటే దొరసాని కూడా నన్ను చూత్తాంది’ అంటూ ఆనంద్ దేవరకొండ అమాయకంగా చెప్పడం.. ‘దొరసాన్ని ప్రేమిస్తోండా.. ఎవలికైనా చెప్పేవ్.. నిజమేననుకుంటారు’ అంటూ మిత్రుడు కౌంటర్ వేయడం ఆసక్తికరంగా ఉంది. శివాత్మిక, ఆనంద్‌ల మధ్య ఓ రొమాంటిక్ సీన్ చూపిస్తూ ‘మీరు దొరసాని’ అని ఆనంద్ అనడం ‘.. కాదు దేవకి’ అని శివాత్మిక, ‘కాదు మీరు.. నా దొరసాని’ అంటూ ఆనంద్.. ఇలా టీజర్ కట్‌లో చూపించిన డైలాగుల్లో లైఫ్ కనిపిస్తోంది. చివరిగా రక్తమోడుతూ చావుబతుకుల మధ్య తలకిందులుగా వేలాడుతున్న ఆనంద్‌ను చూపిస్తూ టీజర్‌ను ముగించటం -ఆలోచనాత్మకంగా ఉంది. దర్శకుడు కెవిఆర్ మహేంద్ర తెరకెక్కిస్తున్న చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూరుస్తున్నారు.