ఎర్రచీర ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటి ఫేం బేబి సాయితేజస్విని, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రలను పోషిస్తున్న చిత్రం ఎర్రచీర. బేబి ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతకంపై చెరువుపల్లి సుమన్‌బాబు స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో జరిగింది. ముఖ్య అతిథులుగా నటకిరీటి రాజేంద్రప్రసాద్, దర్శకుడు అనీల్ రావిపూడి ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ- సాయి తేజస్విని వయసులో చిన్నదైనా చక్కగా నటించింది. ఫస్ట్‌లుక్ హారర్ కోణం కనిపిస్తోంది. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలి. రాజేంద్రప్రసాద్‌గారిని డాడి అని పిలుస్తా. నా అన్ని సినిమాల్లో ఆయన ఉంటారు. సరిలేరు నీకెవ్వరులో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మహేష్‌కు, ఆయనకు మంచి సన్నివేశాలున్నాయి అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ- సాయి తేజస్విని లుక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉందని పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది. చిన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తేనే మాలాంటివాళ్ళకు మంచి అవకాశాలు వస్తాయి. సినిమా తప్పకుండా విజయం సాధించి నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలన్నారు. చిత్ర దర్శకుడు సుమన్‌బాబు మాట్లాడుతూ- పోస్టర్ చూసి సినిమా హారర్ థ్రిల్లర్ సినిమా అనుకుంటున్నారు కానీ ఇది ఫ్యామిలీ, మదర్ సెంటిమెంట్ వున్న కథ. హారర్‌ని టచ్ చేసామంతే. విజయంపై ధీమాగా ఉన్నాం. అనిల్ రావిపూడి చేతులమీదుగా నా సినిమా ఫస్ట్‌లుక్ లాంఛ్ చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు అన్నారు.