ఇద్దరూ కలిసి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- ‘నా పేరు సూర్య..’ తరువాత చేసే మూవీకి దర్శకత్వం వహించే ఛాన్స్ తనకు కలిసొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్‌కే అప్పగించాడు. తనకోసం ఎదురుచూసిన విక్రమ్ కె కుమార్, సుకుమార్లను కాదని బన్నీ, మాటల మాంత్రికుడితో జతకట్టాడు. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ నేడు తన ట్విట్టర్ ఖాతాలో మూవీకి సంబంధించి ఓ సమాచారం పోస్ట్ చేసింది. బన్నీ 19వ సినిమాగా రానున్న సినిమా నేడు హైదరాబాద్‌లో రెండో షెడ్యూలు మొదలు పెట్టామన్నది ఆ సమాచారం. బన్నీ సరసన నటిస్తున్న పూజాహెగ్డే ఈ షెడ్యూలుకు జాయినవుతోంది. గతంలో బన్నీ- పూజాహెగ్డేలు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమా కోసం జతకట్టారు. మళ్లీ ఈ సినిమా కోసం రొమాన్స్ చేయనున్నారు. తమన్ మ్యూజిక్ సమకూరుస్తుంటే, గీతాఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నాయి. 2020 సంక్రాంతి కానుకగా ఇది విడుదల కానుందట.