మరో... రాములమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌ఫుల్ పాత్రలో విజయశాంతిని స్క్రీన్‌మీద చూపించేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి ఉవ్విళ్లూరుతున్నాడట. మహేశ్ 26వ ప్రాజెక్టుకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే. విలన్ పాత్ర పోషించనున్న జగపతిబాబును సమర్థంగా ఎదుర్కోగలిగే ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో విజయశాంతి క్యారెక్టర్‌ను డిజైన్ చేశాడని తెలుస్తోంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ప్రాజెక్టులో మహేశ్‌తో రష్మిక మండన జోడీకడుతోంది.
చిత్రమైన కాంబినేషన్స్‌తో ప్రాజెక్టు సెట్ చేస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా చాలాకాలంగా స్క్రీన్‌కు దూరంగావుంటున్న విజయశాంతిని దర్శకుడు అనిల్ ఏరికోరి తీసుకొస్తుండటంతో ఆమె పాత్రపై ఆసక్తి లేకపోలేదు. దగాపడిన అడవి బిడ్డగా పెత్తందారులపై తుపాకి ఎక్కుపెట్టిన రాములమ్మ -ఈ సినిమాలో ఊరి బాగుకోసం కత్తిపట్టిన పవర్‌ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ కనిపించనుందని సమాచారం. ప్రతి నాయకుడు జగపతిబాబును ఎదుర్కొనే పాత్రలోని వైవిధ్యం, సినిమాలో ఆ పాత్రకున్న ప్రాధాన్యత కారణంగానే విజయశాంతి ఈ సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు.