మన్మథుడితో కీర్తి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మహానటి’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్, తర్వాత తెలుగు పరిశ్రమవైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈమధ్యే ఒక తెలుగు ప్రాజెక్టుకు సైన్ చేసిన ఆమె, ఇప్పుడు మరో సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే ‘మన్మథుడు-2’. సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటిస్తున్న సినిమాలో కీర్తిసురేష్ కీలక పాత్ర చేస్తోందట. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో ఆమె పాల్గొంటోంది. ఇప్పటికే ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రధాన కథానాయికగా, సమంత ఒక కీలక పాత్రలో నటిస్తుండగా వీరికితోడు కీర్తిసురేష్ కూడా జత చేరడం సినిమాపై ఆసక్తి పెంచుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇప్పటికే 90 శాతం షూట్ పూర్తవగా, సినిమా అనుకున్నట్టే వచ్చిందని యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.