తెలుగులోనూ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా తమిళ చిత్రం ‘కొలైగారన్’. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. ఆషిమా కథానాయిక. దియా మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై టి నరేష్‌కుమార్, టి శ్రీ్ధర్ ‘కిల్లర్’ పేరిట తెలుగులో విడుదల చేస్తున్నారు. మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రమిది. 7న ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో విజయ్ ఆంటోని చెప్పిన విశేషాలు.

సినిమాలో నేనే కిల్లర్‌ని. అర్జున్ పోలీస్ ఆఫీసర్. నెనెప్పుడూ ఫుల్ స్క్రిప్ట్ వింటాను. అలా విని నచ్చి చేసిన సినిమా ఇది. దర్శకుడు నా క్లాస్‌మేట్. కలిసి పనిచేయడం హ్యాపీ అనిపించింది. ఈ ప్రాజెక్టుకు సైమన్ కె సింగ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ మిస్టర్ ముకేష్.
నేను గతంలో ఇండియా పాకిస్థాన్ అనే చిత్రానికి మ్యూజిక్ ఇచ్చాను. అది మూడో సినిమా. అలాగే ఇంకా రెండు మూడు సినిమాలకు చేశాను. ఇప్పుడు నా ఆసక్తి మొత్తం నటనపైనే.
నేనే కిల్లర్‌ని. ఎందుకు, ఎవర్ని చంపుతున్నా. మంచోడినా, చెడ్డోడినా -అన్నదానిపైనే స్టోరీ ఉంటుంది. ఈ ప్రాజెక్టులో అర్జున్ ఉండటం స్పెషల్ ఎస్సెట్.
అర్జున్ ప్రొఫెషనల్ యాక్టర్. ప్రొఫెషనల్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. డెఫినెట్‌గా అర్జున్ పాత్ర సినిమాను మంచి పొజిషన్‌కి తీసుకెళ్తుంది.
మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు. పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నా గత చిత్రాల్లో మెసేజ్ ఉండేది. ఇందులో ఉండదు.
నెగెటివ్ క్యారెక్టర్స్ తీసుకుంటారేంటి? అని చాలామంది అడుగుతుంటారు. బిచ్చగాడు నెగిటివ్ కాదు. ఇందులోనూ నేను నెగెటివ్ కాదు, ఎందుకు కాదో సినిమా చూస్తే అర్థమవుతుంది. నా కిరాతకత్వానికి కారణాన్ని సినిమాలోనే చూడాలి.
ముందు నేను తెలుగు బాగా నేర్చుకోవాల్సి ఉంది. అప్పుడు తెలుగు స్ట్రయిట్ మూవీస్‌లో చేస్తా.
తమిళంలో ఖాకి చేస్తున్నాను. తెలుగులో జ్వాల చేయబోతున్నా, మంచి ఆర్టిస్టులతో కలిసి. ప్రకాష్‌రాజ్, జగపతిబాబు, అరుణ్ విజయ్, సత్యరాజ్ వీళ్లందరితో కలిసి చేయబోతున్నా. ప్రస్తుతం వరుసగా పది సినిమాలున్నాయి. ప్రొడక్షన్ చేయడం లేదు, వేరే బ్యానర్లలోనే.