ఆనంద్‌లాంటి హృతిక్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఓ వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఐఐటి విద్యార్థులకు శిక్షణనిచ్చే లెక్కల మాస్టారు అవతారం ఎత్తుతున్నాడు. ఆ చిత్రమే -సూపర్ 30. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా ఇంటెన్సిటినీ రుచి చూపిస్తోంది. బీహార్‌కు చెందిన గణితవేత్త ఆనంద్ కుమార్ నిర్వహించే ‘సూపర్ 30’ ఐఐటి శిక్షణ సంస్థ బ్యాక్‌డ్రాప్‌లో వికాస్ బెహెల్ తెరకెక్కించిన సినిమా ఇది. ‘్భరత్ పేద దేశమంటారు. ఏవిషయంలో? పెప్పికో అధినేత ఎవరు? యూనిలివర్‌ను నడిపిస్తున్నదెవరు? తెలీకపోతే గూగుల్‌ను సెర్చ్ చేయండి. ఒక్కమాట గూగుల్‌ను శాసిస్తోంది కూడా గూగుల్‌లోనే సెర్చ్ చేసి తెలుసుకోండి. వీళ్లంతా మన భారతీయులే’ అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ను కట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆనంద్‌కుమార్ పాత్రను పోషిస్తున్న హృతిక్ -పాత్రకు తగిన వైవిధ్యాన్ని రుచి చూపించాడు. అనివార్య కారణాల వల్ల ఐఐటీ విద్యాసంస్థనుంచి ప్రొఫెసర్‌గా బయటికి వచ్చిన ఆనంద్‌కుమార్ -సొంతంగా కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించటం దగ్గర్నుంచి కథ మొదలవుతుంది. ఏటా 30మంది ఉత్తమ విద్యార్థులకు ఉచితంగా ఐఐటి కోచింగ్ ఇస్తూ అద్భుతాలను ఆవిష్కరిస్తున్న ఆనంద్‌కుమార్ లైఫ్‌లో ఎదుర్కొన్న సంఘటనలు, అడ్డంకులు, అధిగమించిన విధానం.. ఇదే ప్రధాన ఇతివృత్తం. ఈ బయోగ్రఫీ జూలై 12న థియేటర్లకు రానుంది.