టైమ్ దొరికింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్నాళ్లపాటు రాజకీయాలను పక్కనపెట్టి మళ్లీ ఇండస్ట్రీకి పరిమితం కానుందంటూ వస్తున్న కథనాలపై సీనియర్ నటి విజయశాంతి ఓ క్లారిటీ ఇచ్చేసింది. ‘ఎన్నికల హడావుడి ముగియడంతో పొలిటికల్ రెస్ట్ దొరికింది. టైమ్ దొరికింది కదాని.. సినిమాలపై దృష్టి పెట్టా’నంటోంది. పదమూడేళ్ల విరామం తరరువాత మహేష్‌బాబు 26వ ప్రాజెక్టు కోసం స్క్రీన్‌పైకి వస్తున్న విజయశాంతి, వచ్చే 26నుంచి షూటింగ్‌కు హాజరుకానుందట. మహిళా ప్రాథాన్యత కలిగిన పాత్రలతో లేడీ సూపర్‌స్టార్ రేంజ్‌కి ఎదిగిన విజయశాంతి, రాజకీయంగా మాత్రం ఏ పార్టీలోనూ నిలదొక్కుకోలేకపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ స్టార్ కాంపైనర్‌గా ఎన్నికల హడావుడి ముగించిన విజయశాంతి, సినిమాలపై తన దృక్ఫధాన్ని వెల్లడించారు. ఆర్నెల్ల క్రితమే తనకు సినిమా చాన్స్‌లు వచ్చాయని, అయితే, అప్పటికే కీలక ప్రచార బాధ్యతలు పార్టీ తనకు అప్పగించటంతో సాధ్యం కాలేదన్నారు. ఇప్పుడు రాజకీయంగా బిజీగా లేకపోవడంతో సినిమాలపై దృష్టి సారిస్తున్నట్టు చెబుతోంది విజయశాంతి.