అథ్లెటిక్‌గా ఆది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన కథలు, పాత్రలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారుతున్నాడు ఆది పినిశెట్టి. తాజాగా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ప్రాజెక్టుకు ఓకే చెప్పాడట. సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 12నుండి ప్రారంభమవుతుంది. దర్శకుడు ప్రిత్వి ఆదిత్య తెరకెక్కించనున్న చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామంటోంది చిత్రబృందం. ఓ యువకుడు అథ్లెట్‌గా మారేక్రమంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎలా అధిగమించి లక్ష్యానికి చేరుకున్నాడనేదే ప్రధాన ఇతివృత్తం. చిత్రాన్ని ఐబీ కార్తికేయన్ బిగ్ ప్రింట్ పిక్చర్స్ సంస్థపై రూపొందిస్తున్నారు. చిత్రానికి ప్రవీణ్‌కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.