హిప్పీ.. బోల్డ్ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, దిగంగన సూర్యవంశి హీరో హీరోయిన్లుగా కలైపులి ఎస్ థాను సమర్పణలో వి క్రియేషన్స్ పతాకంపై తమిళ దర్శకుడు టిఎన్ కృష్ణ తెరకెక్కించిన లవ్ ఎంటర్‌టైనర్ -హిప్పీ. జూన్ 6న విడుదలవుతున్న సందర్భంగా టిఎన్ కృష్ణ మీడియాతో మాట్లాడారు.
అలా కుదిరింది..
తెలుగులో ఆర్‌ఎక్స్ 100 సినిమా చూశా. బాగానచ్చింది. రీమేక్ కోసం హీరో కార్తికేయను కలిశాను. అంతకుముందే నిర్మాత కలైపులి థానుకు ఈ కథ వినిపించాను. కార్తికేయతో కథ గురించి చెప్పినప్పుడు థాను చాలా ఎగ్జయిట్ అయ్యాడు. తప్పకుండా మనం ఈ సినిమా చేద్దామని అన్నారు. దాంతో థాను కూడా ఓకే అనడంతో సినిమా సెట్స్‌పైకి వచ్చింది.
హిప్పీ అంటే..
హిప్పీ అంటే.. ఓ యాటిట్యూడ్. తన మనసులో ఏదున్నా దాచుకోకుండా బయటికి చెప్పే పాత్ర. కోపం, సంతోషం.. ఏదీ దాచుకోని వ్యక్తి గురించి చెప్పే కథ. ఈ కథకు హీరో కార్తికేయ పూర్తి న్యాయం చేసాడు. కథకు స్ఫూర్తి -14 శతాబ్దంలో జాన్ క్యూరియస్ రాసిన ఆడమ్ అండ్ ఈవ్. దానే్న కథగా మలచుకున్నా.
జెడి పాత్ర..
జెడి చక్రవర్తిది కీరోల్. ఆయన ఇప్పటివరకు ఎన్నో రకాల పాత్రలు చేశారు. కానీ ఇందులో కొత్తగా కనిపిస్తారు. హీరో కార్తికేయ మధ్య మంచి బాండింగ్ కుదిరింది. బాలీవుడ్‌లో హీరోలు, కమెడియన్స్ అనే దాన్ని బేస్‌చేసుకుని కాకుండా, క్యారెక్టర్‌ను బేస్ చేసుకునే సినిమాలు చేస్తారు. ఇలాంటి సినిమాల్లో నటులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. మన దగ్గర హీరో బేస్డ్ మూవీలే ఎక్కువ. ఇది తప్పని అనడం లేదు. అయితే ఇప్పుడిప్పుడే క్యారెక్టర్ బేస్డ్ మూవీస్ చేస్తున్నాం. అలా పాత్రలతో నడిచే కథ ఇది.
దిగంగనను ఎంపిక చేశా
హీరోయిన్ దిగంగన గురించి చెప్పాలంటే -కథలో భాగంగా కొత్త అమ్మాయిని వెతుకుతున్నప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటోలు చూసా. కథకు సెట్ అవుతుందనిపించింది. దాంతో ఆమెను కాంటాక్ట్ చేశా. తాను చిన్నప్పుడు బాల నటిగా కొన్ని సినిమాలు కూడా చేసిందట. అందుకే నటనలో చాలా ఈజ్ ఉంది.
అందుకే ఈ గ్యాప్..
నేను -సూర్య, భూమిక, జ్యోతికలతో తీసిన నువ్వు నేను ప్రేమ.. తరువాత మధ్యలో తమిళంలో ఓ సినిమా చేశాను. కానీ అది విడుదల కాలేదు. మళ్ళీ చాలారోజుల తరువాత తెలుగులో ఈ సినిమా చేస్తున్నాను. నాకు తెలుగు పరిశ్రమ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ సినిమా షూటింగ్‌లో తెలుగు నేర్చుకున్నా.
లస్ట్ కాదు.. ప్యూర్ లవ్..
ఇది లస్ట్ సినిమా కాదు. లస్ట్ బేస్డ్ మూవీస్ చాలానే రావచ్చు. అయితే లవ్‌ను స్ట్రాంగ్‌ను క్యారీ చేసే సినిమాలు ఎమోషనల్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ఎక్స్‌ట్రార్డినరీ లవ్ కంటెంట్‌లో లస్ట్ కొంత కనిపించొచ్చేమోగానీ, లస్ట్ బేస్డ్ కాదు. అలాంటివి ఆడవు కూడా. ఇది ప్యూర్ లవ్ స్టోరీ. బోల్డ్ కంటెంట్ అనేకంటే.. చాలామంది ఎమోషన్స్ ఉంటాయి. స్ట్రాంగ్ లవ్ కంటెంట్ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే అంశాలున్నాయి. నేటి ట్రెండ్‌లో ఇద్దరు లవర్స్‌మధ్య వచ్చే చిన్న చిన్న ఇగోస్‌వల్ల వాళ్ల జీవితాలు ఎలా మారుతున్నాయన్న విషయాన్నీ చర్చించాం.
తదుపరి చిత్రాలు..
నిర్మాత థానుతో నాకున్న పరిచయం చాలరోజులది. ఆయన ఈ కథను చాలాబాగా నమ్మాడు. ఆయన బ్యానర్‌లోనే నెక్స్ట్ సినిమా కూడా చేస్తున్నా. ఈ కథ యూనివర్సల్. ఏ భాషలో అయినా తీయొచ్చు. నిజానికి ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ప్లాన్ చేశాం. కానీ ఒక భాషలో ఉన్న బ్యూటీ మరో భాషలో రాదనిపించి కేవలం తెలుగువరకే తీసాం. తమిళనాడులో కూడా తెలుగులోనే విడుదలచేస్తాం. ఈ సినిమాతోపాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఓ సినిమా ఉంటుంది. అలాగే థాను బ్యానర్‌లో తెలుగు, తమిళ భాషల్లో మరో సినిమా ఉంది.

-శ్రీనివాస్ ఆర్ రావ్