బిజీబిజీగా శృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామగా సౌత్‌లో ఇమేజ్ తెచ్చుకున్న శృతిహాసన్ గత కొన్నిరోజులుగా ఏ సినిమాకూ ఓకే చెప్పడం లేదు. ఆమధ్య తన తండ్రి కమల్‌హాసన్ తెరకెక్కించిన శభాష్‌నాయుడు సినిమా తరువాత అటు తెలుగు, ఇటు తమిళంలో ఏ సినిమాకూ సైన్ చేయలేదు. ఈ గ్యాప్‌లో మైఖేల్ అనే అతడితో జోరుగా ప్రేమాయణం సాగించింది. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలంటూ హంగామా చేశారు. దాంతోపాటు శృతిహాసన్ పాప్‌స్టార్‌గా రాణించాలని ఓ మ్యూజక్ ఆల్బమ్ కూడా చేసి సక్సెస్ అయింది. ఇదంతా బాగానే ఉంది. శృతి మైఖేల్‌తో ఘాటుప్రేమలో ఉంది కాబట్టి.. త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సినిమాలు మానేసిందేమో అనుకున్నారు అంతా. మధ్యలో ఏమైందో ఏమో.. మైఖేల్‌తో శృతి ప్రేమాయణం బ్రేకప్ అయ్యింది. తరువాత తమిళంలో ఓ టీవీ షో కూడా చేసిన అమ్మడు, ఇవన్నీ లాభం లేదనుకుందో ఏమో.. మళ్లీ హీరోయిన్‌గా బిజీ అవ్వాలని ప్రయత్నాలు మొదలెట్టింది. వెంటనే తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా మొదలెట్టేసింది.
శృతి సినిమాలకు పచ్చజెండా ఊపడంతో వరుసగా సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయట. ఇప్పటికే మెగాస్టార్ -కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలో ఓ కీ రోల్ కోసం శృతిహాసన్‌ని అడిగితే ఓకే చెప్పిందట. దాంతోపాటు తాజాగా రవితేజ సరసన నటించేందుకు రెడీ అన్నదట. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోనూ శృతిహాసన్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేశారట. దాంతోపాటు మరో మూడు నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.