ఫ్రాన్స్‌లో విజయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘డియర్ కామ్రేడ్’ ప్రాజెక్టును పూర్తి చేసేసిన విజయ్ దేవరకొండ -తదుపరి ప్రాజెక్టు కోసం ఫ్రాన్స్‌లో చక్కర్లు కొడుతున్నాడు. భరత్‌కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘..కామ్రేడ్’ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే -దర్శకుడు క్రాంతిమాధవ్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టుతో విజయ్ బిజీ అయిపోయాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై ఈ కొత్త ప్రాజెక్టు తెరకెక్కుతోంది. రాశిఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లా.. ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి సిద్ధపడిన విజయ్ -ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న కీలక సన్నివేశాల షూటింగ్‌కు హాజరయ్యాడు. నాయికా నాయకులకు సంబంధించిన కొన్ని ముఖ్య ఘట్టాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీత దర్శకుడు. టైటిల్ ప్రకటించని సినిమా షూట్‌లో ఇదీ విజయ్ స్టిల్.