సెవెన్.. ఓ విజువల్ ట్రీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడి అవతారం ఎత్తాలన్న ఆలోచన చాలాకాలంగా ఉన్నా, ఇంత త్వరగా సాధ్యమవుతుందని అనుకోలేదు. ఈ స్టోరీ లైన్‌తో సినిమాటోగ్రఫీకీ మంచి స్కోప్ ఉంది. నైట్ ఎఫెక్ట్స్, థ్రిల్స్.. మొత్తంగా ఆడియన్స్‌కి
విజువల్ ట్రీట్.

ట్వెంటీఫోర్ క్రాఫ్ట్స్‌లో ఏదోక క్రాఫ్ట్‌నుంచి -డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కు రావడం ఇండస్ట్రీలో కొత్త కాదు. అలా ఇప్పుడు సెవెన్‌తో షఫీ కూడా డైరెక్టరయ్యాడు.
భలే భలేమగాడివోయ్, నేను లోకల్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు.. చిత్రాలకు డీవోపీగా పనిచేసిన
అనుభవం ఇతనిది. కిరణ్ స్టూడియోస్ నిర్మించిన ఓ రొమాంటిక్ థ్రిల్లరే -సెవెన్‌కు డైరెక్టర్. ఒక హీరో (హవీశ్), ఆరుగురు హీరోయిన్ల (రెజీనా, నందితాశే్వత, అనీస్ ఆంబ్రోస్, త్రిధాచౌదరి, అదితి ఆర్య, పూజాతా పొన్నాడ)తో నిజార్ షఫీ దర్శకత్వ అనుభవం
ఎలాంటిదో చెప్పేదే ఈ ఇంటర్వ్యూ.

చెన్నై ఎంజిఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ చేశా. అప్పుడే ఓ షార్ట్ఫిల్మ్‌కి డైరెక్టర్‌ని. తరువాత రజనీకాంత్ రోబోకి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దగ్గర అసిస్టెంట్. తర్వాత తమిళంలో మూడు సినిమాలు (సత్యరాజ్ నిర్మించిన ‘నాయికల్ జాకిరతై’ సహా) చేశా. ఆ వర్క్ మారుతికి నచ్చడంతో -్భలే భలే మగాడివోయ్, నేను లోకల్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు సినిమాలు పడ్డాయి. ఇప్పుడు సెవెన్‌కి దర్శకుడిని.
హీరో హవీష్ ఫోన్ చేసి మంచి లైన్ విన్నా, డైరెక్షన్ చేస్తారా అన్నాడు. నాకూ స్టోరీ లైన్ నచ్చింది. రమేష్ వర్మతో కలిసి డెవలప్ చేశాం.
ఇదొక రొమాంటిక్ ఇనె్వస్టిగేషన్ థ్రిల్లర్. పోలీస్ ఆఫీసర్ రెహమాన్ దగ్గరకు ఓ కేసు వస్తుంది. కేసులో ఏడుగురు కీలకం. సినిమా చూడాల్సిందే.
హీరో హవీశ్ కొత్తగా కనిపిస్తాడు. కిస్సుల థాట్ నాదే. కథలో భాగమే. ఆర్టిస్టుగా తను కొంచెం ఆలోచించి ఉండొచ్చేమోగానీ, దర్శకుడిగా నాక్కావాల్సింది నేను చేయించాను.
సినిమాను ఆరు రీళ్లుగా విడగొడితే, రీలుకో హీరోయిన్. కథలో అందరూ ముఖ్యలే. ఇదే ఆడియన్స్‌కి ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎవ్వరినీ ఎంచలేం, అంతా బాగా చేశారు.
సినిమాలో మూడు పాటలు. మూడూ హిట్టు. థ్రిల్లర్స్‌కు బ్యాగ్రౌండే ప్రాణం. చేతన్ భరద్వాజ్ సక్సెసయ్యాడు.
రమేష్‌వర్మ కథ చెప్పారు. టీమ్ డెవలప్ చేశాం. సెట్స్‌మీద మాత్రం పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆయన జోక్యం అంతే.
సినిమాటోగ్రాఫరే దర్శకుడైతే, హెల్దీనెస్ ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్టు తీయొచ్చు.
దీనివల్ల ఇబ్బందంటూ ఏమీ పడలేదు. ఆపరేటివ్ కెమెరామెన్ ఒకరిని పెట్టుకున్నా. కాకపోతే శైలజారెడ్డి, సెవెన్ షెడ్యూల్స్ క్లాషైన కారణంగా మాత్రం పదిరోజులు ఇబ్బంది పడ్డా. నిద్రలేని రాత్రులు గడిపా.
దర్శకుడిని అనగానే రత్నవేలు హ్యాపీ ఫీలయ్యారు. మారుతి నుంచీ అదే రెస్పాన్స్.
డీవోపీగా కొన్ని ప్రాజెక్టుల కమిట్‌మెంట్ ఉంది. వాటికి సమస్యలు రానివ్వకుండా, దర్శకుడిగా రెండు ఐడియాలు సిద్ధం చేసుకున్నా. ఒకటి లవ్‌స్టోరీ, మరొకటి థ్రిల్లర్. రెండు జోనర్లూ ఇష్టమే. వాటిని డెవలప్ చేశాక ఆలోచిస్తా.