భయపెట్టడానికే ఫిక్సయ్యంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన అమ్మాయిని ఆత్మ ఆవహించినా, అమ్మాయి ఆత్మరూపమెత్తినా -సినిమా వరకూ ఆ స్పాన్ భలేగుంటుంది. అందుకే మిల్కీ బ్యూటీ తమన్నా క్రమంగా హారర్‌కి దగ్గరైంది. ఆత్మల కథలన్నీ ఆమెను వెతుక్కుంటూ వెళ్తున్నాయి. ఈ విషయాన్ని కసేపు పక్కనపెడితే, మండే వేసవిలో ప్రేక్షకుడికి మరింత చెమటలు పట్టించే అంశానికి తమన్నా కేంద్రబిందువైంది. ఒకే రోజున రెండు భాషల్లో చేసిన హారర్ చిత్రాలతో తమ్మూ బేబీ థియేటర్లకు వస్తోంది. ఈ చిత్రంలో మరో విచిత్రం ఏంటంటే -ఆ రెండు ప్రాజెక్టుల్లోనూ హీరో ప్రభుదేవా కావడం. తమన్నా, ప్రభుదేవా జంటగా ఏఎల్ విజయ్ తెరకెక్కించిన దేవీ -2 (తెలుగులో అభినేత్రి -2) ఆగస్టు 31న విడుదలవుతుంటే, అదేరోజున బాలీవుడ్‌లో తమన్నా, ప్రభుదేవా జోడీగా చక్రి తోలేటి తెరకెక్కించిన హారర్ మూవీ ఖమోషి సైతం విడుదలవుతోంది. అంటే ఒక జోడీ రెండు భాషల్లో చేసిన రెండు సినిమాలు ఒకేరోజున విడుదలవుతున్నాయన్న మాట. ఇది యాధృచ్చికమే అయినా, ఆసక్తికరం. ఏ సినిమాతో తమ్మూ బేబీ ఎంత భయపెడుతుందో.. ఆ రోజున వెండితెరపై చూద్దాం.
రెడీ రెడీ అంటూ..
ఇదిలావుంటే, రెడీ రెడీ అంటున్న మిల్కీబ్యూటీ తమన్నా, ప్రభుదేవల పాటను అభినేత్రి-2 చిత్రబృందం విడుదల చేసింది. గ్లామరస్ తమన్నా చిందులేస్తూ ప్రభుదేవాను ఆటపట్టిచే పాటను అట్రాక్టివ్‌గా తీశారు.