హ్యాట్రిక్ యోచనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూ.ఎన్టీఆర్ వ్యూహం చూస్తుంటే, అదే అయ్యుంటుంది అన్నది ఇండస్ట్రీ టాక్. హ్యాట్రిక్ హిట్ కోసం తాపత్రయపడని స్టార్ ఎవరుంటారు చెప్పండి. అందుకే ఎన్టీఆర్ -అందుకు అనుగుణంగా టైమ్‌ని సెట్ చేసుకుంటున్నాడు. ఆమధ్య త్రివిక్రమ్‌తో ‘అరవింద సమేత.. వీరరాఘవ’ చేసి భారీ హిట్టందుకున్న ఎన్టీఆర్ -ప్రస్తుతం రాజవౌళి దర్శకత్వంలో ‘ట్రిపుల్ ఆర్’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. భారీ మల్టీ స్టారర్ కనుక షూటింగ్ పూరె్తై ఆడియన్స్ ముందుకు రావడానికి టైమ్ పట్టొచ్చు. హిస్టరీని సోషియో ఫాంటసీ కోణంలో దర్శకుడు జక్కన్న డిజైన్ చేశాడు కనుక, ఆడియన్స్ అప్రీసియేషన్ కచ్చితంగా దక్కుతుందన్న నమ్మకం ఉంది. ఈ ప్రాజెక్టుతో హిట్టందుకుంటే -ఎన్టీఆర్ అకౌంట్‌లో రెండు వరుస హిట్లు.
అందుకే -టైమ్ వేస్ట్ చేయకుండా, రిస్క్‌ని నెత్తికెత్తుకోకుండా మూడో ప్రాజెక్టు విషయంలో జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు ఎన్టీఆర్. అంటే -మళ్లీ త్రివిక్రమ్ చేతికే తరువాతి ప్రాజెక్టు అప్పగించే అవకాశం లేకపోలేదన్న టాక్ వినిపిస్తోంది. రెండు రోజుల క్రితం బర్త్‌డే విషెస్ చెప్పడానికి వచ్చిన ఆప్తుల వద్ద ఎన్టీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించాడన్న సమాచారం వినిపిస్తోంది. సో, రెండో ప్రాజెక్టు నుంచే మూడో హిట్టుకి జూ.ఎన్టీఆర్ ట్రాక్ సిద్ధం చేస్తున్నాడన్న మాట.