31న ఫలక్‌నుమా దాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రైలర్‌తో సెనే్సషన్ సృష్టించిన ఫలక్‌నుమా దాస్ ఈనెల 31న థియేటర్లను టచ్ చేస్తున్నాడు. హైదరాబాద్ కల్చర్‌ను ప్రతిబింబిస్తూ విశ్వక్సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. కరాటే రాజు సమర్పణలో విశ్వక్సేన్ సినిమాస్, టెర్రనోవా పిక్చర్స్ బ్యానర్‌పై కరాటే రాజు, చర్లపల్లి సందీప్ ఈ సినిమాను నిర్మించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో మే 31న థియేటర్లకు తెస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘సినిమాను వందమంది వరకూ చూసి చాలా బావుందని కితాబునిచ్చారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నా. మే 31న థియేటర్లకు వస్తున్నాడు ఫలక్‌నుమా దాస్’ అన్నారు. నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ హైదరాబాద్ కల్చర్‌ని ప్రతిబింబించే చిత్రమిది అన్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేనూ ఓ పాత్ర పోషించా. మొదట్లో విశ్వక్‌మీద పెద్దగా నమ్మకం లేకున్నా, అతను తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ చూసిన తరువాత ఆలోచన మారింది. ఈ సినిమా ఓ మలయాళం చిత్రానికి రీమేక్ అని తెలిసిందే’ అన్నారు. నిర్మాత డి సురేష్‌బాబు మాట్లాడుతూ ‘మే 31న సినిమా విడుదలవుతుంది. తెలుగు పరిశ్రమకు ఇదో కొత్త సినిమా. హీరో, దర్శకుడు విశ్వక్ ఎంతో ఇష్టంతో చేసిన సినిమాలో, దర్శకుడు తరుణ్ భాస్కర్ బాగా నటించాడు. సంభాషణలు రియలిస్టిక్‌గా ఉన్నాయి. ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా పూర్తి కమర్షియల్ చిత్రంగా చేశారు. సంగీతం బావుంది’ అన్నారు. హీరోయిన్ సలోని మిశ్రా మాట్లాడుతూ ‘ఇందులో రా కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు.