దేశభక్తితో.. మేజర్ చక్రధర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామదూత ఆర్ట్స్ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మించిన రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎంతవారలైనా’ ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. ఈ సినిమాతో నటుడిగా, నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాడు సీతారెడ్డి. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆయన రెండో సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టారు. మేజర్ చక్రధర్ పేరుతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా సీతరెడ్డి మాట్లాడుతూ- ‘ఎంతవారలైనా’ హిట్ చేసిన ప్రేక్షకులకు, మీడియావారికి ధన్యవాదాలు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మేజర్ చక్రధర్ అనే మరో చిత్రాన్ని త్వరలో మొదలుపెడుతున్నాను. దీనికి సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో తెలియజేస్తా. అన్నిరకాల కమర్షియల్ హంగులతో సినిమా వుంటుంది. దేశభక్తితోపాటు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ఈ సినిమా ఉంటుందని తెలిపారు.