రేసర్ హీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘డియర్ కామ్రేడ్’గా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు సెనే్సషనల్ స్టార్ విజయ్ దేవరకొండ. జూలైలో సినిమా విడుదలకానుంది. ఇక క్రాంతిమాధవ్‌తో చేస్తున్న ప్రాజెక్టు సైతం ఇప్పటికే సెట్స్ మీదుంది. ఇవి నడుస్తుండగానే తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలైతో ప్రాజెక్టుకు రెడీ అయిపోయాడు విజయ్ దేవరకొండ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టును ఆదివారం లాంచ్ చేశారు. సినిమాకు క్లాప్ కొట్టిన దర్శకుడు కొరటాల శివ, స్క్రిప్ట్‌ను దర్శకుడు ఆనంద్‌కు అందించాడు. గొట్టిపాటి రవి కెమెరా స్విచాన్ చేశారు. ప్రాజెక్టుకు ‘హీరో’ టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో విజయ్‌తో మాళవిక జోడీ కట్టింది. 22నుంచి రెగ్యులర్ షూట్‌కి వెళ్తున్నట్టు చిత్రబృందం చెబుతోంది. కొత్త ప్రాజెక్టులో విజయ్ దేవరకొండ బైక్‌రేసర్‌గా కనిపిస్తాడని సమాచారం. తొలి షెడ్యూల్‌లో భాగంగా ఢిల్లీలో రెండు బైక్ రేసింగ్ సీన్లు చిత్రీకరించనున్నారట. ఈ రెండు సన్నివేశాలకే 8 కోట్లు వెచ్చిస్తున్నట్టు అంచనా. ఈ సన్నివేశాల కోసం విదేశాల నుంచి బైక్ రేసర్లను, చిత్రీకరణ కోసం డ్రోన్లు, ఆపరేటర్లను తీసుకొస్తున్నట్టు సమాచారం. అంటే, విజయ్ ఈ ప్రాజెక్టుతో టాప్ యాక్షన్ మూవీ చేయబోతున్నాడన్న మాట.