‘లక్ష్మీబాంబు’ నుంచి తప్పుకున్నా: లారెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్యాద లేనిచోట తాను ఉండలేనని ఆవేదన వ్యక్తం చేశాడు దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ రాఘవ. తన అనుమతి లేకుండా, తనతో చర్చించకుండానే కాంచన హిందీ రీమేక్ ‘లక్ష్మీబాంబు’ పోస్టర్‌ను విడుదల చేయడంపట్ల తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ కారణంగానే లక్ష్మీబాంబు ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. హిందీ రీమేక్‌కు రాఘవ లారెనే్స దర్శకుడు. అక్షయ్‌కుమార్, కైరా అద్వానీ లీడ్‌రోల్స్ చేస్తున్నారు. ‘గౌరవం లేని ఇంటికి వెళ్లకూడదు’ అన్న సామెత ఒకటుంది. ఈ ప్రపంచంలో డబ్బు, పేరుకంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం. అది నాకు ఉంది కనుకే ‘లక్ష్మీబాంబు’ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నా’ అంటూ లారెన్స్ ట్వీట్ చేశాడు. తన నిర్ణయం వెనుక చాలా కారణాలు ఉన్నాయని, వాటిని బహిరంగంగా చెప్పాలని అనుకోవడం లేదంటూ వ్యాఖ్యానించాడు. పోస్టర్ విడుదల చేశారన్న విషయం మూడో వ్యక్తి ద్వారా దర్శకుడికి తెలిసిందంటే, ఆ ప్రాజెక్టులో దర్శకుడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాంచన్ స్క్రిప్ట్ నాది. అలాగని స్క్రిప్ట్ ఇచ్చేయమని నేను అడగలేను. ఇంత జరిగిన తరువాత దర్శకుడిగానూ కొనసాగలేను. అక్షయ్ సర్ అంటే అభిమానముంది. అందుకే స్క్రిప్ట్‌ని వదిలేస్తున్నా. వాళ్లకు నచ్చిన దర్శకుడితో ఆ ప్రాజెక్టు పూర్తి చేసుకోవచ్చు. ఎవరు టేకప్ చేసినా సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్’ అంటూ లారెన్స్ ట్వీట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.