దేవుడొక్కడే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డివైన్ విజన్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డివిజన్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ సమర్పిస్తున్న చిత్రం గాడ్ ఆఫ్ గాడ్స్. వెంకటేష్ గోపాల్ దర్శకత్వంలో జగ్‌మోహన్ గర్గ్, ఐఎంఎస్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తేజశ్వీ మనోజ్ఞ, త్రియుగమంత్రి, రాజసింహవర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చిలో హిందీలో విడుదలైన సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధం చేశారు. ఆడియో, ట్రైలర్‌ను నిర్మాత దిల్‌రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశంలో ఎమోషన్స్ ఎక్కువ. ఆ విషయం ఈ సినిమాతో అనుభవంలోకి వస్తుంది. బ్రహ్మకుమారీస్ ఇకముందు ఇటువంటి సినిమాలు తీస్తే నావంతు సహకారం అందిస్తాను అన్నారు. తేజశ్వీ మనోజ్ఞ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. మొదటి సినిమానే ఇంత మంచి డివోషన్‌కి సంబంధించి చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గాడ్ ఆఫ్ గాడ్స్ ప్రత్యేకించి మతానికి సంబంధించిన చిత్రంకాదు. తప్పక చూడాల్సిన సినిమా అన్నారు. డైరెక్టర్ వెంకట్ గోపాల్ మాట్లాడుతూ చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఎవ్వరినీ నొప్పించకుండా, భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని చెప్పాం అన్నారు. ప్రొడ్యూసర్ ఐఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ మంచి కథను కష్టపడి తెరకెక్కించాం. సంగీతం కూడా బాగా కుదిరింది అన్నారు.