అందమైన ఉప్పెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా కాంపౌండ్ నుంచి వస్తోన్న కొత్త హీరో వైష్టవ్ తేజ్. సాయితేజ్ సోదరుడు వైష్టవ్ ‘ఉప్పెన’ ప్రాజెక్టుతో హీరోగా పరిచయమవుతున్నాడు. అయితే వైష్టవ్‌తో జోడీ కట్టే హీరోయిన్ విషయంలో చాలాకాలంగానే సస్పెన్స్ నడుస్తోంది. తాజాగా వైష్టవ్‌తో జోడీ కట్టిన హీరోయిన్ ఇమేజ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కొత్త నటి కృతి శెట్టి వైష్టవ్‌తో జోడీ కడుతోంది. ‘సరిగమ’ అనే కన్నడ సినిమాతో ఈ బ్యూటీ తెరగేంట్రం చేసింది. ఇప్పుడు ‘ఉప్పెన’తో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఆకర్షణీయమైన కళ్లు, అమాయకత్వంతో కూడిన నాజూకుదనాన్ని చూపిస్తోన్న ఈ బ్యూటీకి తెలుగులో మంచి అవకాశాలు దక్కడం ఖాయమనిపిస్తోంది. మే 25నుంచి ఉప్పెన రెగ్యులర్ షూట్‌కు ముహూర్తం నిర్ణయించుకున్నారు. చాలాకాలం క్రితమే విడుదల చేసిన ప్రీలుక్‌లో వైష్టవ్ జాలరి వేషంలో కనిపించాడు. దీన్నిబట్టి సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో కథ నడవొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ టీంనుంచి వచ్చిన బుచ్చిబాబు ‘ఉప్పెన’ చిత్రానికి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి సుకుమార్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న చిత్రంలో తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ రోల్ పోషిస్తున్నాడు. శ్యామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నాడు.