త్రీడీ నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లిసాలో తనది లీడ్‌రోల్ అనేకంటే, తాను నటించిన తొలి త్రీడీ సినిమా అంటోంది అంజలి. చాలా గ్యాప్ తరువాత మళ్లీ తమిళ ఇండస్ట్రీలో గుర్తింపుకోసం ప్రయత్నాలు మొదలెట్టింది. వ్యక్తిగత కారణాల కారణంగా కొంత గ్యాప్ తీసుకున్న అంజలి -లీసా అంటూ త్రీడీ హారర్ చిత్రంతో ఆడియన్స్ ముందుకొస్తోంది. లీసా ప్రాజెక్టుతో త్రీడీలో నటించడం ఎంత క్లిష్టమైన విషయమో అర్థమైందని, ఒక సీన్‌కు దర్శకుడికంటే ముందు కెమెరా టీమ్, టెక్నీషియన్ల బృందం ఓకే చెప్పాల్సి ఉంటుందని అంటోంది. అంతేకాదు, హారర్ సినిమాను చూసినపుడు భయపడినా, వాటిని ఎలా చిత్రీకరిస్తారో తెలిసిన తరువాత ఆ భయం పోతుందన్న అనుభవం తనకు కలిగిందని అంటోంది. గ్రీన్ మ్యాట్‌మీద కొన్ని, సీజీలో కొన్ని సీన్స్ పూర్తి చేస్తారు. సో, నటించేటపుడు దర్శకుడు కోరిన ఎక్స్‌ప్రెషన్ మీద దృష్టిపెడతామే తప్ప, ఏమాత్రం భయం ఉండదని అంటోంది అంజలి. హీరోయిన్ కాకముందు జీవితం వేరని, హీరోయిన్ అయిన తరువాత కొంత వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుందన్న విషయాన్ని అంజలి స్పష్టం చేసింది. గ్యాప్ తరువాత లీసాతో ఆడియన్స్ ముందుకి వస్తున్న అంజలి -ఎలాంటి ప్రశంసలు అందుకుంటుందో చూడాలి.