జాన్ కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో ప్రభాస్ ఏకబిగిన రెండు సినిమాలు లాగిస్తున్నాడు. సుదీర్ఘంగా సాగుతున్న యాక్షన్ మూవీ ‘సాహో’ షూటింగ్‌ను కొనసాగిస్తూనే, జిల్ ఫేమ్ రాధాకృష్ణతో రొమాంటిక్ ‘జాన్’నూ నడిపిస్తున్నాడు. దీర్ఘకాలం సాగిన బాహుబలి తరువాత చేస్తున్న ప్రాజెక్టులు కావడం, రెండూ భారీ బడ్జెట్ చిత్రాలే కావడంతో ప్రభాస్ ప్రాజెక్టులపై ఆసక్తి కనిపిస్తోంది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో జాన్‌ను తెరకెక్కిస్తున్నట్టు తాజా సమాచారం. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. తొలి షెడ్యూల్‌ను యూరోప్‌లో మొదలెట్టిన దర్శకుడు అక్కడ కొంతభాగాన్ని చిత్రీకరించాడు. దానికి కనెక్టివిటీగా మరికొన్ని సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇందుకోసం 30 కోట్లతో భారీ సెట్‌ను సెట్ చేస్తున్నారని, మిగతా షూట్‌లో ఎక్కువ భాగం ఈ సెట్‌లోనే సాగొచ్చని అంటున్నారు. జాన్‌కు లవర్‌గా పూజా హెగ్దె కనిపించనుంది.