వీడిన సైలెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళం, హిందీ బాషల్లో దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న తాజా సస్పెన్స్ థ్రిల్లర్ -సైలెన్స్. నాయికా ప్రాథాన్యత కలగిన పాత్రలకు పెట్టిందిపేరైన అనుష్క, భాగమతి తరువాత చేస్తోన్న ప్రాజెక్టు ఇది. అమెరికాలో నడిచే కథ కనుక షూటింగ్ అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. చిత్రీకరణకు అంతా సిద్ధం చేసుకున్న తరువాత, స్వీటీకి వీసా రాకపోవడంతో ప్రాజెక్టును పోస్ట్‌పోన్ చేశారు. తాజాగా అనుష్క వీసాకు అనుమతి లభించటంతో, అమెరికా ఫ్లైట్ ఎక్కేందుకు సినిమా టీం సన్నాహాలు చేసుకుంటోందని సమాచారం. హేమంత్ మధుకర్ సిద్ధం చేసుకున్న సస్పెన్స్ థ్రిల్లర్‌లో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్, తమిళ నటుడు మాధవన్, అంజలి, షాలినీపాండేలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.