ఇకపై సఖి అవుతుందేమో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటితో కీర్తి సురేష్ రేంజ్ మారిపోయింది. అప్పటివరకు గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ, మహానటిలో సావిత్రిగా జీవించేసిన తరువాత కీర్తి నిజంగానే మహానటిగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా తరువాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేసింది. కానీ ఆమెకు ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం దక్కలేదు. దాంతో మళ్లీ హిట్ కోసం తాపత్రయపడింది. ప్రస్తుతం కీర్తి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. నరేంద్ర అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ యూరప్‌లో జరుగుతోంది. రాజేంద్రప్రసాద్, నదియ, సీనియర్ నరేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఓ సూపర్ టైటిల్ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా... సఖి? అప్పట్లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సఖి సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే టైటిల్ పెడుతున్నట్టు టాక్. ఈ సినిమాపై కీర్తి చాలా ఆశలే పెట్టుకుంది. ఈ సినిమాతోపాటు బాలీవుడ్‌లో కూడా క్రేజీ అవకాశాన్ని దక్కించుకుంది కీర్తి. సౌత్‌లో హీరోయిన్‌గా మంచి క్రేజ్‌మీద వున్న ఈ స్మైలీ పోకస్ ఇపుడు బాలీవుడ్‌పై పడింది. తమిళంలో తాజాగా సూర్య సరసన నటిస్తోంది. దాంతోపాటు అజిత్, విజయ్‌ల సరసన అవకాశాలు అందుకుంది.