ఇంకా హీరోయిన్‌నే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ఛార్మి ప్రస్తుతం నిర్మాతగా మారి చిత్రాలకు దూరంగా వుంటున్నారు. నిర్మాతగా ఆమె తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- చిత్రాలకు దూరంగా వున్నా, ఇప్పటికీ తనకు హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నాయన్నారు. 13 ఏళ్ళకు నేను సినిమాల్లోకి వచ్చాను. అన్ని భాషల్లో కలుపుకుని ఇప్పటివరకు 55 సినిమాల్లో నటించాను. కెరియర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులను చూశాను. కథానాయికగా నా కెరియర్ పట్ల సంతృప్తిగానే ఉన్నాను. ఇప్పటికీ తమ సినిమాల్లో చేయమంటూ నాకు చాలామంది అఫర్లు ఇస్తున్నారు కానీ నేను సున్నితంగా తిరస్కరిస్తున్నాను. నిర్మాణంపైనే దృష్టి పెడుతున్నాను. ప్రస్తుతం మా నుంచి రానున్న ఇస్మార్ట్ శంకర్ ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఆకాశ్ పూరితో చిత్రం త్వరలో వుంటుంది అని తెలిపింది.