కేన్స్‌లో బాలీ బ్యూటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిష్టాత్మక 72వ కేన్స్ వేడుకల్లో బాలీవుడ్ తారలు రెడ్‌కార్పెట్‌పై మెరుపులు మెరిపించారు. ఒకేరోజు వేడుకలకు హాజరై తళుక్కుమన్నారు. భారతీయ చిత్రాల ప్రదర్శనకు అర్హత దక్కకున్నా, బాలీవుడ్ తారలకు కేన్స్ ప్రత్యేక ఆహ్వానాలు అందడం తెలిసిందే. అందులో భాగంగానే దీపిక పదుకొనె, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రాలు తళుక్కుమన్నారు. వైట్ అండ్ బ్లాక్ కాంబినెషన్ డ్రెస్, పోనీటైల్‌తో దీపిక మెరిస్తే, ఈమధ్యే మణికర్ణిక చిత్రంతో హిట్టందుకున్న కంగన మాత్రం కాంచీవరం చీరలో క్లాసిక్ అండ్ మోడ్రన్ స్టయిల్ మేళవింపులో కనిపించింది. కేన్స్ రెడ్ కార్పెట్‌పై తొలిసారి అడుగులేసిన గ్లోబర్ స్టార్ ప్రియాంక మాత్రం సింపుల్ డ్రెస్, లైట్ అప్పియరెన్స్‌తో గ్లోబల్ స్టయిల్‌లో కనిపించింది. మొత్తంమీద బాలీవుడ్ బ్యూటీల స్పెషల్ అట్రాక్షన్ అదిరిపోయింది.