ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేట్టతో మళ్లీ ఫాం చూపించిన సూపర్‌స్టార్ రజనీ -ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ‘దర్బార్’తో గుండెల్లో బుల్లెట్లు దింపుతాడట. మురగదాస్ -రజనీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా -దర్బార్. చాలాకాలం తరువాత ద్విపాత్రాభినయం చేస్తున్న రజనీ -ఒక పాత్ర కోసం పోలీస్ యూనిఫాం ధరిస్తున్నాడని తెలిసిందే. ఆ పోలీస్ ఆఫీసర్ ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అన్నది తాజా సమాచారం. ప్రస్తుతం ముంబయిలో తొలి షెడ్యూల్ షూట్ జరుగుతోంది. ఇక్కడి సెట్స్‌లో ఓ ఎన్‌కౌంటర్ సీన్‌ని తెరకెక్కించారు. నెలాఖరుకు తొలి షెడ్యూల్ పూర్తి చేసి, కొంత విరామం తరువాత రెండో షెడ్యూల్ మొదలు పెట్టొచ్చని తెలుస్తోంది. రంజాన్ మాసం కావడంతో సెట్‌లోని వాళ్లకు ఇఫ్తార్ విందిచ్చిన రజనీ, షూటింగ్‌లో మంచి హుషారును చూపిస్తున్నాడట.