భయపెడుతున్న శివరంజని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకట్టుకునే కంటెంటుంటే హారర్ చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ తగ్గదని తెలుగు ప్రేక్షకుడు నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి మంచి కంటెంట్‌తో వస్తోన్న చిత్రమే -శివరంజని. హాట్ బ్యూటీ రష్మీగౌతమ్, నందు జంటగా నందినిరాయ్ మరో కీలక పాత్రలో నటించిన సినిమా ట్రైలర్‌ను దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. వినాయక్ మాట్లాడుతూ ‘టైటిల్, ట్రైలర్ బావుంది. ఇప్పుడొస్తోన్న హారర్ చిత్రాలకు భిన్నమైన కంటెంట్ సినిమాలో కనిపిస్తోంది. మంచి విజయం సాధించి టీంకు మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నా. చిత్ర నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి చిన్న చిత్రాలకు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు అవసరం. ఇలాంటి నిర్మాతలకు మంచి విజయాలు దక్కితే కానె్సప్ట్ బేస్డ్ సినిమాలు ఎక్కువగా షైన్ అవుతాయి’ అన్నారు. దర్శకుడు నాగప్రభాకరన్ మాట్లాడుతూ ‘హారర్ అనగానే గుర్తొచ్చే అంశాలకు భిన్నమైన కథ ఇది. ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ మధ్య నడిచే హారర్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయన్నారు. పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటోన్న చిత్రాన్ని జూన్ మొదటివారంలో విడుదల చేయనున్నాం’ అన్నారు. నిర్మాత పద్మనాభరెడ్డి మాట్లాడుతూ దర్శకుడు వినాయక్ స్వయంగా ట్రైలర్ విడుదల చేయడం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. శివరంజని రొటీన్ హారర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుందని నమ్ముతున్నాను’ అన్నారు.