తప్పుచేస్తే శిక్ష తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామదూత ఆర్ట్స్ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి సీతారెడ్డి నిర్మించిన రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ -ఎంతవారలైనా. ఇప్పటికే విడుదలైన ఆడియో, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో పాజిటివ్ బజ్ ఏర్పడింది. తెలుగు, కన్నడలో రూపొందిన చిత్రంలో అద్వైత్, జహీదా శ్యామ్, అలోక్ జైన్, జి సీతారెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు మాట్లాడుతూ ‘సినిమాలోని ‘ఏహే మురారి’ పాట మిలియన్ వ్యూస్‌కి చేరింది. అనుకున్న బడ్జెట్‌లో తొలి సినిమానే ఎంతో అనుభవంతో తెరకెక్కించాడు దర్శకుడు’ అన్నారు. దర్శకుడు గురు చిందేపల్లి మాట్లాడుతూ ‘లొకేషన్ల విషయంలో ముందస్తు ప్రణాళిక కలిసొచ్చింది. సినిమాటోగ్రాఫర్ మురళీమోహన్‌రెడ్డి పనితనం సినిమాకు అస్సెట్. తప్పు చేసినవాళ్లు ఎవ్వరైనా శిక్షార్హులే అన్న కానె్సప్ట్‌ను రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం’ అన్నారు.
నిర్మాత, నటుడు జి సీతారెడ్డి మాట్లాడుతూ ‘మంటిపాటలు, బీజీ స్కోర్ ఇచ్చిన సుక్కు హీరోగా నిలిచాడు. విజువల్ ఫీస్ట్ కోసం మంచి లొకేషన్స్‌లో షూట్ చేశాం. దర్శకుడు గురు చిందేపల్లి పనితనం చూపించారు. ఎంతవారలైనా హిట్టవ్వడం ఖాయమన్న నమ్మకముంది. ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నాం’ అన్నారు.