కట్ కట్ ప్యార్‌దే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రకుల్‌ప్రీత్‌సింగ్ తాజా బాలీవుడ్ సినిమా ‘దే దే ప్యార్‌దే’. అజయ్ దేవగన్ హీరో. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషించింది. కథ విషయానికి వస్తే ఆశీష్ అనే 50ఏళ్ల అజయ్ భార్య టబునుంచి విడిపోయి సింగిల్‌గా ఉంటాడు. ఆ క్రమంలో అందమైన అయేషా (రకుల్) ప్రేమలో పడతాడు. అయితే రకుల్ పాత్రకు తగ్గట్టు ఆయేషాను కాస్త బోల్డ్‌గా డిజైన్ చేశాడు దర్శకుడు. ఇదే సెన్సార్‌కు మండించింది. ఆయేషా బోల్డ్‌నెస్ అతిగా ఉందంటూ సెన్సార్ ఫీలైందట. ఒక పాటలో లిక్కర్ బాటిల్ పట్టుకుని మధ్యమధ్యలో సిప్ చేస్తూ చిందులేయడం లాంటి సన్నివేశాలు మార్చాలంటూ సెన్సార్ సూచించింది. మద్యం సీసాకు బదులు పూల బొకే పెట్టమని సూచించారట. డబుల్ మీనింగ్ డైలాగులు సైతం ఎక్కువ చొప్పించటంతో, వాటికీ కత్తెర వేయమంటూ సెన్సార్ తాఖీదు ఇచ్చినట్టు సమాచారం. దీంతో చిత్రబృందం ఒకింత నిరాశలో ఉంది. అకివ్ ఆలీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.