బాలకృష్ణ సరసన..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ బయోపిక్ తరువాత -బాలకృష్ణ తదుపరి ప్రాజెక్టు సన్నాహాలు పూర్తయ్యాయి. తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్‌కు బాలయ్య గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో -ప్రాజెక్టు పూజా కార్యక్రమాలు నేడు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచే రెగ్యులర్ షూటింగూ మొదలవుతుందట. తొలి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లోనే ప్లాన్ చేశారని టాక్. సి కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న కథనాలు లేకపోలేదు. అయితే దీనిపై యూనిట్ మాత్రం వౌనం వహిస్తోంది. ద్విపాత్రాభినయ బాలయ్యకు ఇద్దరు హీరోయిన్లు ఉంటారు కనుక, ఇప్పటికే కన్నడ బ్యూటీ హరిప్రియను ఎంపిక చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. తాజాగా మరో హీరోయిన్‌నూ ఫైనల్ చేశారట. ఆర్‌ఎక్స్ 100తో టాలీవుడ్‌ని బుట్టలో వేసుకున్న పాయల్ రాజపుత్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. బాలయ్య సరసన హీరోయిన్ అంశం ప్రతి సినిమాకూ టెన్షన్ కలిగించేదే. కానీ ఈసారి బాలయ్య సరసన పాయల్ ఓకే చెప్పడంతో టీమ్‌కు హీరోయిన్ టెన్షన్ తగ్గింది. బాలకృష్ణ- కెఎస్ రవికుమార్‌ల కాంబోలో ఇదివరకే వచ్చిన ‘జైసింహ’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా అదే దర్శకుడికి బాలయ్య చాన్స్ ఇవ్వడం ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు. ఈ ప్రాజెక్టు తరువాత బోయపాటికి బాలయ్య చాన్స్ ఇవ్వనున్నాడట. బాలకృష్ణను కలిసి వ్యవహారాన్ని సర్దుబాటు చేసుకోడానికి బోయపాటి కూడా సన్నద్ధుడౌతున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.