నాని.. గాళ్స్’లీడర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెర్సీ హిట్టుతో మంచి ఊపుమీదున్నాడు నాని. తదుపరి ప్రాజెక్టుగా దర్శకుడు విక్రమ్‌కుమార్ తెరకెక్కించనున్న ‘గ్యాంగ్‌లీడర్’లో చెలరేగిపోయేందుకు సిద్ధమవుతున్నాడు. కొత్త ప్రాజెక్టులో ఐదుగురు చార్మింగ్ బ్యూటీలతో నాని జోడీ కడుతున్నాడన్న వార్తలు ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించాయి. అంతమంది గాళ్స్‌తో ఆటాడుకునే పాత్ర ఏమై ఉంటుందోనన్న ఆసక్తిని మరింత రేకెత్తిస్తూ -తాజా సమాచారం బయటకు పొక్కింది. నానితో జోడీ కడుతున్న బ్యూటీలంతా దొంగలట. ఈ దొంగలకు లీడరే నాని అన్నది కొత్త ట్విస్ట్. అలా టైటిల్‌ను జస్టిఫై చేస్తూ గాళ్స్ ‘గ్యాంగ్‌లీడర్’గా నాని కనిపించనున్నాడన్న కథనాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. నాని పెర్ఫార్మెన్స్ స్టామినాను దృష్టిలో పట్టుకునే దర్శకుడు విక్రమ్‌కుమార్ మంచి కమర్షియల్ సేలబుల్ పాయింట్‌ను డిజైన్ చేశాడని అంటున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ సీడ్ నాని ఖాతాలో మరో హిట్‌ను చేర్చడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి.