హైదరాబాద్‌లో ట్రిపుల్ ఆర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శక ధీరుడు రాజవౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలుకానుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సినిమా, మూడో షెడ్యూల్‌ని హైదరాబాద్ పరిసరాల్లో ప్లాన్ చేశారు. 21నుంచి షెడ్యూల్ మొదలుకావొచ్చని చిత్రబృందం అంటోంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్, అలియాభట్.. ముఖ్య పాత్రధారులు పాల్గొంటారట. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాపై అందరి దృష్టీ ఉంది. బాహుబలిలాంటి సంచలన హిట్ తరువాత రాజవౌళి ఎలాంటి సినిమా తెరకెక్కిస్తాడోన్న సందేహాలను నివృత్తిచేస్తూ -చరణ్, ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్ ప్రకటించి కలకలం రేపాడు. మెగా, నందమూరి హీరోల కలయికలో మొదటి సినిమా కావడంతో రెండువర్గాల అభిమానుల్లో ఆసక్తి తారాస్థాయికి చేరింది. కొమరం భీం, అల్లూరి సీతారామరాజుల కథతో ఫిక్షన్ స్టోరీగా తెరకెక్కించే సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. భారత్‌లోనే భారీ క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందే సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం సహా మరిన్ని ఇతర భాషల్లోనూ విడుదలకు ఇప్పటినుంచే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు జక్కన్న. ఈ ప్రాజెక్టు 2020 జూలై 30న థియేటర్లకు రానున్నట్టు ప్రకటించడం గమనార్హం.