కల నెరవేరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అవకాశం ఇంతకాలానికి వచ్చింది. ఎప్పటికైనా రాజేష్ దర్శకత్వంలో సినిమా చేయాలన్న కల ‘మిస్టర్ లోకల్’తో తీరింది -అంటున్నాడు హీరో శివకార్తికేయన్. శివ, నయన్ జోడీగా స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తోన్న చిత్రమే -మిస్టర్ లోకల్. మే 17న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో శివకార్తికేయన్ మాట్లాడుతూ రాజేష్ దర్శకత్వంలో జీవా హీరోగా తెరకెక్కిన ‘శివ మనసుల శక్తి’ సినిమాలో రజనీ వాయిస్ మిమిక్రీ చేశా. ‘బాస్ ఎన్గిర భాస్కరన్’, ‘వరుత్తపడాద వాలిబర్ సంఘం’ చిత్రాల సమయంలో రాజేశ్ అవకాశం ఇస్తారేమోనని చూశా. అప్పటి నుంచి చాన్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. మిస్టర్ లోకల్‌తో ఆ కోరిక నెరవేరుతోంది అన్నారు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే కథలో తనకు అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉందన్నాడు. తన పాత్రకు డిజైన్ చేసిన కస్ట్యూమ్స్ సినిమాకు ప్రాణమని అంటూనే, తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న నయనతార పాత్ర అద్భుతంగా వచ్చిందన్నాడు. దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ ‘శివకార్తికేయన్ ప్యాన్స్‌కు ఈ సినిమా ఓ సమ్మర్ ట్రీట్. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది’ అన్నారు. హిప్‌హాప్ సమకూర్చిన సంగీత బాణీలు ఇప్పటికే మోతపుట్టించాడు. ‘మిస్టర్ లోకల్’ చిత్రంపై చిత్రబృందం కాన్ఫిడెంట్‌గా ఉంది.