ఏం తక్కువని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ హీరో కాబోతున్నాడు. ఔను, ఇది నిజం. హీరోలు దర్శకులవుతున్న వేళ, దర్శకులు హీరోలవ్వడంలో తప్పులేదుగా. ఒకప్పుడు హీరోలకు బ్లాక్‌బస్టర్స్ హిట్లు ఇచ్చిన వినాయక్, హీరోగా అలాంటి సిట్యుయేషన్‌లో కలిగే ఆనందాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాడు. బ్లాక్‌బస్టర్ హిట్టుకొట్టినపుడు దర్శకుడి ఆనందం ఎలా ఉంటుందో తెలుసు కనుక, హీరో ఎలా ఫీలవుతాడన్న ఫీల్ కోసం చూస్తున్నాడనే అనుకోవాలి. ఈ సర్‌ప్రైజ్‌కు మరో యాడ్ ఏంటంటే -ఆ సినిమాను నిర్మించబోయేది హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పైనే ఈ సినిమాను నిర్మించనున్నాడని ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. డైరెక్టర్ శంకర్ దగ్గర చాలాకాలంపాటు సహాయ దర్శకుడిగా పని చేసి, ఆ తరువాత ‘శరభ’ చిత్రాన్ని తెరకెక్కించిన ఎన్ నరసింహారావు వినాయక్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడట. ప్రీప్రొడక్షన్స్ అన్నీ పూర్తయ్యాయని, వచ్చే జూలైలో ప్రాజెక్టును సెట్స్‌మీదకు తీసుకెళ్తారన్న టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ చిత్రంలో వినాయక్ కామియో అప్పియరెన్స్ ఇవ్వడం తెలిసిందే. ఇప్పుడు డైరెక్ట్‌గా ఓ ప్రాజెక్టులో లీడ్ రోల్ చేస్తున్నాడనగానే, జోడీ ఎవరై ఉండొచ్చోనన్న సందేహాలు తలెత్తక మానవు. అంతేకాదు, వినాయక్ హీరోయిజం మేకోవర్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తీ మొదలైంది. ఆ విషయాలు త్వరలోనే వెల్లడవుతాయి. గత ఏడాది సాయిధరమ్ తేజ్‌ను ‘ఇంటిలిజెంట్’గా చూపించిన వినాయక్, ఆ తరువాత ఏ ప్రాజెక్టునూ టేకప్ చేయలేదు.