ప్రేమ.. శాపం మధ్యలో పండుగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలీ హీరోగా పెదరావూరు ఫిల్మ్ సిటీ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన జంధ్యాల మార్క్ కామెడీ సినిమా -పండుగాడి ఫొటో స్టూడియో. షూటింగ్ పూరె్తైన సందర్భంగా దర్శకుడు దిలీప్‌రాజా మాట్లాడుతూ ‘దర్శకుడు సుకుమార్ ఓకే చేసిన స్టోరీ ఇది. వీడు ఫొటోతీస్తే పెళ్లయిపోద్ది అనేది టాగ్ లైన్. సినిమాలో హీరోకి 40ఏళ్లు వచ్చేవరకు పెళ్లికాదని నాగదేవత శాపముంటుంది. ఆ క్రమంలో హీరోయిన్ కంచు కనకరత్నం పరిచయం, ఆమెతో ప్రేమలోపడటం, మరోపక్క శాపం వల్ల జరిగే పరిణామాలే చిత్ర కథాంశం. పూర్తి హాస్యభరిత చిత్రమిది. 1150 చిత్రాల్లో నటించిన ఆలీ, ఈ సినిమాలో హీరోగా అద్భుతమైన నటన ప్రదర్శించారు. హీరోయిన్‌గా రిషిత పరిచయమవుతుంది. కడుపుబ్బ నవ్వుకునేలా పండుగాడి ఫొటో స్టూడియో సినిమా తెరకెక్కిస్తున్నాం. వినోద్‌కుమార్, బాబుమోహన్, సుధ, జీవ, శ్రీలక్ష్మి, రామ్‌జగన్ లాంటి సీనియర్ నటులతోపాటు విలక్షణమైన పాత్రల్లో సందీప్‌రాజా, టీనాచౌదరి పరిచయమవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నాం’ అన్నారు.