ఎన్నారై కొడుక్కి ఎన్నితిప్పలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ సంపన్న ఎన్నారై కొడుకు తప్పనిసరై భారత్‌లో అడుగుపెట్టి -జేబులో చిల్లిగవ్వలేక ఎన్ని ఇబ్బందులు పడ్డాడన్న కానె్సప్ట్‌ను రుచి చూపించబోతున్నాడు అల్లు శిరీష్. తన కొడుక్కి జీవితం విలువ తెలియాలనే భారత్‌కు పంపుతాడు ఎన్నారై నాగబాబు. భారత్‌కు రాగానే క్రెడిట్ కార్డుల్ని బ్లాక్ చేస్తాడు. డబ్బు కోసం అల్లాడిపోయిన శిరీష్, ఫ్రెండ్ (మాస్టర్ భరత్)తో కసిలి ఎలాంటి ఆ సినిమానే -ఏబీసీడీ. అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ అన్నది టాగ్‌లైన్. మలయాళంలో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న ‘ఏబీసీడీ’ చిత్రానికి రీమేక్‌గా మే 17న విడుదల కాబోతోంది. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మధుర శ్రీధర్‌రెడ్డి, యస్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జోడీగా వస్తున్న చిత్రం ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి నాచురల్ స్టార్ నాని ముఖ్యఅతిథిగా విచ్చేశాడు. అల్లు శిరీష్ మాట్లాడుతూ సినిమాను తెలుగులో చేయమని చెప్పింది నా కజిన్ రామ్‌చరణ్. రెండేళ్ళ క్రితం ఎలాంటి సినిమా చేస్తే బావుంటుందనే డిస్కషన్ వచ్చింది. అప్పుడ రామ్‌చరణ్ తమిళ ఏబీసీడీని సూచిస్తూ, ఆ పాత్రకు సరిగ్గా సూటవుతానని సూచించాడు. కాకపోతే మంచి దర్శకుడు, ప్రొడక్షన్ హౌస్ దొరకడానికి టైంపట్టింది. సినిమాను చూస్తున్నపుడు నా పర్సనల్ లైఫ్ చూస్తున్నట్టే అనిపించింది. రియల్ లైఫ్ తండ్రీ కొడుకుల్ని తెరపై చూస్తున్నట్టు ఫీలయ్యా. డబ్బు విలువ తెలియని హీరో పాడైపోయాడని భావించిన తండ్రి, అతన్ని బాగు చేయడానికి ఏం చేశాడనేదే కథ. నా పాత్ర పేరు అరవింద్ ప్రసాద్. మా నాన్న ఇన్‌స్పిరేషన్‌తో ఆ పేరు పెట్టుకున్నా. ఎన్నారై యువకుడైన నేను ఇండియా వచ్చినపుడు డబ్బులు లేకుండా ఎలాంటి కష్టాలు పడ్డానన్నది చూసి మీరు ఎంజాయ్ చేస్తారు అన్నాడు. రామ్ సినిమాటోగ్రఫీ, మధుర శ్రీ్ధర్, యష్ రంగినేని, ధీజ్ మొగిలినేని సహకారం మర్చిపోలేను. కోస్టార్లు, టెక్నీషియన్లకు కృతజ్ఞతలు అన్నాడు. నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ ‘సినిమా ట్రైలర్ చూస్తుంటే పిల్ల జమీందార్ గుర్తుకొస్తోంది. అంతకుమించి ఏబీసీడీ హిట్టవ్వాలని ఆకాంక్షిస్తున్నా. చిన్నపిల్లాడిలా ఉన్నప్పటి పరిచయం శిరీష్. ఇప్పుడు హీరో. శిరీష్, దర్శకుడు సంజీవ్, టోటల్ టీంకు ఆల్ ది బెస్ట్ అన్నాడు. నిర్మాత మధుర శ్రీ్ధర్ మాట్లాడుతూ ‘దర్శకుడు ఏం చెప్పాడో తెరపై చూసి ఎంజాయ్ చేయండి. సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నా’ అన్నారు. చిత్ర సమర్పకుడు డి సురేష్‌బాబు మాట్లాడుతూ ‘ఈ సినిమాతో శిరీష్‌కు పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నా’ అన్నారు.